వారియర్స్‌కు బుల్స్‌ దెబ్బ | Bengaluru Bulls Beat Warriors | Sakshi
Sakshi News home page

వారియర్స్‌కు బుల్స్‌ దెబ్బ

Aug 4 2019 10:02 AM | Updated on Aug 4 2019 10:02 AM

Bengaluru Bulls Beat Warriors - Sakshi

పట్నా : ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ను బెంగళూరు బుల్స్‌ దెబ్బ కొట్టింది. శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో బుల్స్‌ 43–42తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. బెంగళూరు తరఫున పవన్‌ కుమార్‌ ఏకంగా 29 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 21–34తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ చేతిలో ఓడింది. పాంథర్స్‌ రైడర్‌ దీపక్‌ నర్వాల్‌ 9 పాయింట్లతో మెరిశాడు. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన జైపూర్‌ జట్టు పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో  హరియాణా స్టీలర్స్‌తో తమిళ్‌ తలైవాస్, పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్‌ తలపడతాయి.   

Advertisement
 
Advertisement
Advertisement