మధు కుమార్, అజారుద్దీన్‌ల వీరవిహారం | azharuddin, madhu kumar got centuries | Sakshi
Sakshi News home page

మధు కుమార్, అజారుద్దీన్‌ల వీరవిహారం

Aug 18 2016 12:26 PM | Updated on Sep 4 2017 9:50 AM

జిందా తిలిస్మాత్ బ్యాట్స్‌మెన్ మధు కుమార్ (161 బంతుల్లో 124; 17 ఫోర్లు, 1 సిక్స్), అజారుద్దీన్ (69 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు.

సాక్షి, హైదరాబాద్: జిందా తిలిస్మాత్ బ్యాట్స్‌మెన్ మధు కుమార్ (161 బంతుల్లో 124; 17 ఫోర్లు, 1 సిక్స్), అజారుద్దీన్ (69 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో క్రౌన్ సీసీపై జయభేరి మోగించింది. మొదటి రోజు ఆటలో క్రౌన్ సీసీ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలింది. తర్వాత జిందా తిలిస్మాత్ 69 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

 

ముఖ్యంగా అజారుద్దీన్ భారీ సిక్సర్లతో చెలరేగి మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో 329 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన క్రౌన్ సీసీ 36.1 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఆలౌటైంది. అమర్ అయూబ్ 5, విష్ణు చైతన్య 3 వికెట్లు పడగొట్టారు.
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు : సలీంనగర్ తొలి ఇన్నింగ్స్: 279 (జమీరుద్దీన్ 92, ఖాలిద్ 60, గౌస్ జునైద్ 70; నొమన్ అఫ్సర్ 3/51), బ్రదర్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 42/0.


  డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 210 (ఖాసిమ్ వాలి 38, సునీల్ 38; శ్రీనివాస్ 6/76, దినేశ్ 4/63), రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 178 (దినేశ్ 89; మెహ్‌తాబ్ అలమ్ 3/44), డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 107/9 (శ్రీనివాస్ 5/44, దినేశ్ 4/47), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 78 (దినేశ్ 35; ఖాసిమ్ వాలి 3/28).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement