కామన్వెల్త్ వెరుుట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో భారత లిఫ్టర్ శివమ్ సైనీ రెండు పతకాలు సాధించాడు.
పెనాంగ్ (మలేసియా): కామన్వెల్త్ వెరుుట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో భారత లిఫ్టర్ శివమ్ సైనీ రెండు పతకాలు సాధించాడు. జూనియర్ విభాగంలో సైని స్నాచ్‌లో 132 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 168 కిలోలు బరువు ఎత్తి స్వర్ణం సాధించాడు.
ఇక సీనియర్ 94 కేజీల విభాగంలో శివమ్ సైనీ రజతం గెలిచాడు. స్నాచ్‌లో 132, క్లీన్ అండ్ జర్క్‌లో 168లతో మొత్తం 300 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.