ఆర‍్చర్‌కు వింత అనుభవం..

Archer Gets Bizarre Questions After Seeking Help - Sakshi

లండన్‌: చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సాధించిన క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌. ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌కప్‌ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఆర్చర్‌ ఇప్పుడు ఆ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. మరొకవైపు ట్వీట్లతో అభిమానుల్ని అలరిస్తూ ఉంటాడు కూడా. ఇక ఆర్చర్‌ చెప్పే జోస్యం అయితే దైవ సంభూతలకే సాధ్యం అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పుడో రెండు-మూడేళ్ల కిందట ఆర్చర్‌ చేసిన ట్వీట్లు ఇటీవల కాలంలో బాగా వైరల్‌ అయ్యాయి. దాంతో ఆర్చర్‌కు ఒక ప్రత్యేకమైన హోదా కూడా అభిమానులు కట్టబెట్టేశారు.

కాగా, తాజాగా ఆర్చర్‌కు వింత అనుభవం ఎదురైంది. తన యూట్యూబ్‌ క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌ వీడియో కోసం కొన్ని ప్రశ్నలు ఇవ్వమంటూ ఆర్చర్‌ ట్వీటర్‌ వేదికగా సాయం కోరితే అతన్ని ఆడేసుకున్నారు నెటిజన్లు. అసలు ఆర్చర్‌ ఊహించని ప్రశ్నలు ఇచ్చారు అభిమానులు. అందులో కొన్ని ఎలా ఉన్నాయో చూద్దాం. పిజ్జాస్‌ను స్క్వేర్‌ బాక్స్‌ల్లోనే ఎందుకు తీసుకొస్తారనే ప్రశ్న బాగుంటుందని ఒక అభిమాని సూచించగా, షార్క్‌ కంటే వేగంగా స్విమ్‌ చేసి బాయ్‌ ఎప్పటికైనా జన్మిస్తాడా అనే ప్రశ్నను మరొకరు ఇచ్చారు. ఇక ఫేవరెట్‌ సింగ్‌.. దించక్‌ పూజానా రాణు మోండలా అనే ప్రశ్నను మరొక అభిమాని సూచించాడు.  చేపకు దాహం వేస్తుందా అనే ప్రశ్నను మరొకరు పేర్కొన్నారు. ఇలా నెటిజన్లు తమకిష్టమైన ప్రశ్నలు ఇచ్చి ఆర్చర్‌ తలపట్టుకునేలా చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top