చాంపియన్స్‌ అపూర్వ, అహ్మద్‌ | Ahmed, Apoorva clinch titles in TS Open Ranking Carrom Tournament | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ అపూర్వ, అహ్మద్‌

Jun 25 2018 10:17 AM | Updated on Jun 25 2018 10:17 AM

Ahmed, Apoorva clinch titles in TS Open Ranking Carrom Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వి–10 తెలంగాణ రాష్ట్ర ర్యాం కింగ్‌ క్యారమ్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్‌ హోదాతో బరిలోకి దిగిన ఎస్‌. అపూర్వ విజేతగా నిలిచింది. చిక్కడపల్లిలోని పోస్టల్‌ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో అపూర్వ, పురుషుల సింగిల్స్‌ విభాగంలో మొహమ్మద్‌ అహ్మద్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఎస్‌. అపూర్వ (ఎల్‌ఐసీ) 25–7, 25–1తో పి. నిర్మల (ఎల్‌ఐసీ)పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్‌ అహ్మద్‌ (హెచ్‌ఎంసీసీ) 25–7, 20– 10తో మొహమ్మద్‌ వసీమ్‌ (ఏసీసీఏ)ను ఓడించాడు.

అంతకుముందు జరిగిన పురుషుల సెమీస్‌ మ్యాచ్‌ల్లో వసీమ్‌ 23–18, 25– 12తో ఎస్‌. రమేశ్‌పై, అహ్మద్‌ 10–25, 22–19, 25–13తో ఎంఏ హకీమ్‌పై నెగ్గారు. మహిళల సెమీస్‌ మ్యాచ్‌ల్లో పి. నిర్మల 25–2, 25–0తో స్వాతిపై, అపూర్వ 25–4, 25–4తో కార్తీక వర్షపై విజయం సాధించారు. మరోవైపు జూనియర్‌ బాలబాలికల విభాగంలో సీహెచ్‌ సాయి చరణ్, సి. కార్తీక వర్ష విజేతలుగా నిలిచారు. ఫైనల్లో సాయి చరణ్‌ (మంచిర్యాల) 25–14, 18–17తో ఆసిఫ్‌ అలీ (నిజామాబాద్‌)పై గెలుపొందగా, కార్తీక వర్ష (ఎన్‌ఏఎస్‌ఆర్‌) 24–4, 25–0తో నందినిని ఓడించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement