బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ | Aditya Verma joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ

Jul 17 2014 5:15 PM | Updated on Sep 2 2017 10:26 AM

బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ

బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ

గుర్తింపులేని బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ గురువారం బీజేపీలో చేరారు.

న్యూఢిల్లీ: గుర్తింపులేని బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ గురువారం బీజేపీలో చేరారు. ఆయనను బీహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై కేసు వేసి ఆయన వార్తల్లో నిలిచారు. ఎన్. శ్రీనివాసన్- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి వర్మ కారణమయ్యారు.

వర్మ పిటిషన్ వేయడంతో స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తుకు సుప్రీంకోర్టు జస్టిస్ ముగ్దల్ కమిటీ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలని శ్రీనివాసన్ ను కోర్టు ఆదేశించింది. శ్రీనివాసన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement