కబడ్డీ లీగ్‌లో అభిషేక్ బచ్చన్ | Abhishek Bachchan to promote Jaipur franchise of Pro Kabaddi | Sakshi
Sakshi News home page

కబడ్డీ లీగ్‌లో అభిషేక్ బచ్చన్

Apr 11 2014 12:25 AM | Updated on Sep 2 2017 5:51 AM

కబడ్డీ లీగ్‌లో అభిషేక్ బచ్చన్

కబడ్డీ లీగ్‌లో అభిషేక్ బచ్చన్

బాలీవుడ్ నటులంతా క్రీడా ఫ్రాంచైజీలకు యజమానులయ్యే పనిలో పడ్డారు.

 జైపూర్ ఫ్రాంచైజీ కొనుగోలు
 
 ముంబై: బాలీవుడ్ నటులంతా క్రీడా ఫ్రాంచైజీలకు యజమానులయ్యే పనిలో పడ్డారు. షారుక్‌ఖాన్, ప్రీతి జింటా, జుహీ చావ్లా, శిల్పాశెట్టి వంటివారు ఇప్పటికే ఐపీఎల్‌లో క్రికెట్ జట్లకు యజమానులుగా కొనసాగుతుండగా.. తాజాగా మరో నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ లీగ్‌లో అడుగు పెట్టారు. ప్రో కబడ్డీ లీగ్ పేరిట నిర్వహించనున్న ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లో అభిషేక్.. జైపూర్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.

 

ఎనిమిది నగరాలకు చెందిన జట్లతో ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 31 వరకు ఈ లీగ్ జరగనుంది. క్రీడాభిమానినైన తనకు కబడ్డీ లీగ్‌లో పాలుపంచుకోనుండటం గొప్ప అనుభూతిస్తోందని అభిషేక్  అన్నారు. ఈ లీగ్‌లో జైపూర్‌తోపాటు ముంబై, కోల్‌కతా, పుణె, ఢిల్లీ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఫ్రాంచైజీలను ఏర్పాటు చేశారు. ఈ లీగ్‌కు ఆటగాళ్ల వేలాన్ని జూన్ 7 నుంచి 10 మధ్య నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement