కామన్వెల్త్ గేమ్స్లో కండోమ్స్కు భలే డిమాండ్ | A wide range of condoms for athletes | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ గేమ్స్లో కండోమ్స్కు భలే డిమాండ్

Jul 28 2014 4:54 PM | Updated on Sep 2 2017 11:01 AM

కామన్వెల్త్ గేమ్స్లో కండోమ్స్కు భలే డిమాండ్

కామన్వెల్త్ గేమ్స్లో కండోమ్స్కు భలే డిమాండ్

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో కండోమ్స్ను భారీ సంఖ్యలో సరఫరా చేసింది.

గ్లాస్గో: ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్.. ఇలాంటి మెగా ఈవెంట్లు ఎక్కడ జరుగుతున్నా క్రీడాకారుల అద్భత ప్రదర్శన, పతకాల ముచ్చట్లే కాదు కండోమ్స్ విషయం కూడా చర్చకు వస్తుంటుంది. రెండేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్లో రికార్డు స్థాయిలో కండోమ్స్ను సరఫరా చేసినా కొరత ఏర్పడింది. ఇక ఢిల్లీలో జరిగిన గత కామన్వెల్త్ గేమ్స్లో అయితే క్రీడాకారులు, కోచ్లు, సహాయ సిబ్బంది కోసం నిర్మించిన క్రీడాగ్రామంలో కండోమ్స్ అడ్డుపడ్డి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది. మెగా ఈవెంట్ల సందర్భంగా కండోమ్స్కు ఎంత డిమాండ్ ఉంటుందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.  

గత సంఘటనలను దృష్టిలోఉంచుకుని స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో కండోమ్స్ను భారీ సంఖ్యలో సరఫరా చేసింది. మహిళల కండోమ్స్ సహా పలు కంపెనీలకు చెందిన నాణ్యమైన పది రకాలను అందుబాటులో ఉంచారు. పోటీలు జరిగే 300 వేదికలకూ కండోమ్స్ను సరఫరా చేశారు. దాదాపు 84 వేలకు పైగా కండోమ్స్ను సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. క్రీడాకారులు, ఇతర స్టాఫ్ తమకు నచ్చినవాటిని ఉచితంగా తీసుకోవచ్చు. ఈ ఈవెంట్లో 71 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా గ్లాస్గోలో హోటల్స్, బార్లు కళకళలాడిపోతున్నాయి. క్రీడలను తిలకించేందుకు ప్రతివారం 7.5 లక్షల మంది నగరానికి వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement