బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ | Sakshi
Sakshi News home page

బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌

Published Fri, Dec 22 2017 12:22 AM

2022 Commonwealth Games at Birmingham - Sakshi

లండన్‌: తదుపరి కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ)కు ఆతిథ్యమిచ్చే వేదిక ఖరారైంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం 2022 ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూజీ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్‌ మార్టిన్‌ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజానికి 2022కు సంబంధించి 2015లోనే డర్బన్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో మరో వేదికను ఎంపిక చేయాల్సివచ్చింది.

2022 సంవత్సరం జూలై 27 నుంచి 7 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌ బడ్జెట్‌ 14 వేల కోట్లు (1.845 బిలియన్‌ యూరోలు)గా నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో గ్రేట్‌ బ్రిటన్‌లో మరో నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా మారనుంది. మాంచెస్టర్‌ (2002 కామన్వెల్త్‌), లండన్‌ (2012 ఒలింపిక్స్‌), గ్లాస్గో (2014 కామన్వెల్త్‌) ఇప్పటికే మెగా ఈవెంట్స్‌కు వేదికలుగా నిలిచాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement