హహ్హహ్హ.. నాతో పెట్టుకుంటే అంతే మరి!

Leopard Vs Porcupine Deadly Battle Video Goes Viral On Social Media - Sakshi

చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. ఇక అది దాడికి దిగితే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీయాల్సిందే. అయితే ఓ రహదారిపై ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను బెంబేలెత్తించింది. పందిపై దాడికి దిగిన ఈ చిరుత చివరకు తగ్గి వెనుదిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అడవి మార్గం గుండా వెళుతున్న ముళ్ల పందిని చూసి చిరుత దానిపై దాడి చేసిన వీడియోను.. పర్విన్‌ కశ్వాన్‌ అనే ఓ ఆటవీ అధికారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘చిరుతకు ముళ్లపందికి మధ్య పోరాటం.. చివరకు చిరుత గుణపాఠాన్ని నేర్చుకుంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్లు వచ్చాయి.

వీడియో ప్రకారం... తనపై దాడి చేస్తున్న చిరుతను చూసి ముళ్లపంది భయపడలేదు. ఎందుకంటే దానితో పెట్టుకుంటే ఎమౌతుందో  చిరుతకే తెలిస్తుందనుకుందో ఏమో మరి.. అది వెంటపడుతున్నా పరిగెత్తలేదు. ఇక దానిని చంపి తీనాలని చూసిన చిరుత పులికి చివరకు తగిన శాస్తి జరిగింది. పందిని కొరకడానికి ప్రయత్నించిన చిరుత నోటికి దాని ముళ్లు గుచ్చుకోవడంతో నొప్పితో  విలవిలలాడింది. చివరకు తిన్నగా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు... ‘అయ్యో! చిరుతకు ముల్లు గట్టిగా గుచ్చుకుని ఉంటుంది , ‘బాబోయ్‌.. రోమాలు నిక్కపోడిచే పోరాటం’ అని.. మరికొందరు చిరుతకు తగిన శాస్తి జరిగిందని అంటూ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top