ఈ కప్ప నిజంగా లక్కీఫెలో

Frog Eats Venomous Snake And Survives After Multiple Bites Became Viral - Sakshi

సాధారణంగా కప్పలను పాములు మింగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కప్ప ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కోస్టల్‌ తైపన్‌ పామును మింగి కూడా ఎప్పటిలాగే ఉండడం విశేషం. అంతేగాక కప్ప పామును మింగేటప్పుడు పలుసార్లు కాటు వేసినా దానికి ఏ విధమైన హాని కలగకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వింత ఘటన ఫిబ్రవరి 4న చోటు చేసుకున్నప్పటికి టౌన్స్‌విల్లే అనే యనిమల్‌ స్వచ్చంద సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆరోగ్యంగా ఉన్న కప్ప ఫోటోలను పోస్ట్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌ అయ్యాయి.

'ఇప్పటివరకు మేము చూడని ఒక వింత ఘటన మమ్మల్ని చాలా ఆశ్యర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కోస్టల్‌ తైపన్‌ను ఆకుపచ్చ రంగులో ఉన్న కప్ప మింగడం చూశాము. మేము పామునైతే కాపాడలేకపోయాం కానీ.. దానిని మింగేటప్పుడు ఆ పాము కప్పను పలుసార్లు కాటేయడం గమనించాము. అప్పటికే కప్ప వెనుక శరీర భాగంలో ఆకుపచ్చ రంగులో కొన్ని డాట్స్‌ కనిపించడంతో ఇక ఎక్కువసేపు బతకదనే భావించాము' అంటూ పోస్ట్‌ చేశారు. వెంటనే ఆ కప్పను స్వచ్చంద సంస్థకు తరలించి అబ్జర్వేషనలో పెట్టారు. తాజాగా కప్పకు సంబందించిన మరికొన్ని ఫోటోలను ఆ సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసింది. 'పామును మింగినా కప్ప ఆరోగ్యంగానే ఉంది. అది పూర్తిగా కోలుకోగానే దానిని వదిలిపెడతాం' అని పేర్కొన్నారు. ఈ ఫోటోలకు 1.7 మిలియన్‌ లైకులు వచ్చాయి.' ఇది నిజంగా అద్భుతం. అంత విషపూరితమైన పామును తిని కూడా కప్ప బతికింది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top