
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 89వ రోజు ప్రజాసంకల్పయాత్ర మొదలైంది. శుక్రవారం ఉదయం ఆయన తూర్పుపాళెం క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ప్రకాశం జిల్లాలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా రాజన్న తనయుడికి ఘన స్వాగతం లభించింది. పెంట్రాల, వాకమల్లవారి పాలెం, బలిజపాలెం, తిమ్మారెడ్డి పాలెం క్రాస్, వెంగళాపురం, అమ్మపాలెం క్రాస్, బంగారక్కపాళెం క్రాస్ గ్రామాల్లో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. కొత్తపేట, లింగసముద్రం, రామకృష్ణాపురం గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు.