గృహ నిర్బంధంలోనే వైఎస్‌ అవినాష్‌ రెడ్డి | YS Avinash Reddy Under House Arrest to Continue | Sakshi
Sakshi News home page

ఇంకా గృహ నిర్బంధంలోనే వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

Mar 6 2018 10:25 AM | Updated on Sep 1 2018 5:08 PM

YS Avinash Reddy Under House Arrest to Continue - Sakshi

సాక్షి, పులివెందుల : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో 144 సెక్షన్‌ ఇంకా కొనసాగుతోంది. పులివెందుల అభివృద్ధిపై టీడీపీ నేతల సవాల్‌పై చర్చకు సిద్ధమన్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. కాగా లాఠీఛార్జ్‌లో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు కూడా వీలు లేకుండా హౌస్‌ అరెస్ట్‌ చేశారని అవినాష్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ తప్పు లేకున్నా ఎంపీని గృహ నిర్బంధం చేయడంపై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు అధికారం తమదేనన్న ధీమాతో టీడీపీ నేతలు అమాయకులపై కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు కలిసేందుకు విజయవాడలో మకాం వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement