80 స్థానాల్లో పోటీ చేస్తాం: శివసేన | We will compete in 80 seats: Shiv Sena | Sakshi
Sakshi News home page

80 స్థానాల్లో పోటీ చేస్తాం: శివసేన

Nov 13 2018 1:28 AM | Updated on Nov 13 2018 1:28 AM

We will compete in 80 seats: Shiv Sena - Sakshi

హైదరాబాద్‌: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్‌.మురారి 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

తాము ప్రకటించిన అభ్యర్థులకు ఇప్పటికే బీ–ఫారాలు ఇచ్చామని, ఈ నెల 14న వారు నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. నిజామాబాద్‌ బోధన్‌ నుంచి మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ప్రేమ్‌ గాంధీ, రాజేం ద్రనగర్‌ అభ్యర్థి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement