మూడో కన్ను తెరచుకుంది..రెప్ప వాల్చదు

Vijaya Sai Reddy Satires On Sujana Chowdary Over Insider Trading In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి : మోసాలు చేయడంలో ఆరితేరిన ఎంపీ సుజనా చౌదరి చంద్రబాబుకు హృదయ కాలేయంగా మారిపోయారని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో తనకు సెంటు భూమి కూడా లేదని సుజనా చౌదరి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఆయన ఇలాగే దబాయించారని గుర్తుచేశారు. ఆ కంపెనీలతో తనకేం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారని..ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. కాగా టీడీపీ సీనియర్‌ నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

ఈగ వాలకుండా చూస్తోంది..
అధికారంలో ఉన్నన్నాళ్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ బయట పడకుండా కాపాడిన ఎల్లో మీడియా ఇప్పటికీ బానిసత్వం కొనసాగిస్తూనే ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ దొంగ కోడెల, ఆయన దూడల మీద ఇప్పటికీ ఈగ వాలకుండా చూసుకుంటోందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా అనే మూడు కన్ను తెరుచుకుందని... మీరెంతగా నిజాలు దాయాలని ప్రయత్నించినా అది రెప్ప వాల్చదని ట్విటర్‌ వేదికగా ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు. అదేవిధంగా..‘తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరు. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమే. అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు’ అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top