ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దుమ్మురేపుతోంది. సోమవారం 4,470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. మేజర్ పంచాయతీలు మినహా దాదాపు కౌంటింగ్ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్ మరోసారి ఆ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు అత్యధికంగా 1373 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 343, టీడీపీ 9, సీపీఎం 10 స్థానాల్లో గెలుపొందారు. ఇంకా సగానికి పైగా స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.
జిల్లాల వారిగా ఫలితాలు..
| క్ర.సంఖ్య | జిల్లా | టీఆర్‌ఎస్ | కాంగ్రెస్ | బీజేపీ | టీడీపీ | సీపీఐ/ సీపీఎం |
ఇతరులు |
| 1 | ఆదిలాబాద్ | 112 | 10 | 9 | 0 | 0 | 15 |
| 2 | భద్రాద్రి | 65 | 29 | 0 | 2 | 20 | 23 |
| 3 | జగిత్యాల | 50 | 22 | 1 | 1 | 0 | 41 |
| 4 | జనగామ | 51 | 21 | 0 | 0 | 0 | 9 |
| 5 | భూపాలపల్లి | 78 | 44 | 3 | 0 | 0 | 17 |
| 6 | గద్వాల | 64 | 19 | 0 | 0 | 0 | 6 |
| 7 | కామరెడ్డి | 84 | 32 | 0 | 0 | 0 | 13 |
| 8 | కరీంనగర్ | 30 | 09 | 03 | 07 | 0 | 33 |
| 9 | ఖమ్మం | 84 | 49 | 5 | 1 | 10 | 22 |
| 10 | ఆసిఫాబాద్ | 60 | 26 | 0 | 0 | 0 | 18 |
| 11 | మహబూబ్‌నగర్ | 110 | 8 | 3 | 12 | 0 | 96 |
| 12 | మంచిర్యాల | 44 | 06 | 0 | 0 | 0 | 26 |
| 13 | మెదక్ | 105 | 28 | 0 | 1 | 0 | 15 |
| 14 | మేడ్చల్ | 12 | 6 | 0 | 1 | 0 | 5 |
| 15 | నిర్మల్ | 90 | 20 | 08 | 0 | 1 | 11 |
| 16 | నాగర్ కర్నూల్ | 92 | 32 | 1 | 0 | 1 | 23 |
| 17 | నల్గొండ | 145 | 73 | 0 | 2 | 2 | 23 |
| 18 | నిజామాబాద్ | 89 | 9 | 1 | 0 | 0 | 26 |
| 19 | పెద్దపల్లి | 45 | 22 | 0 | 0 | 0 | 16 |
| 20 | రాజన్నసిరసిల్ల | 40 | 11 | 1 | 0 | 0 | 23 |
| 21 | రంగారెడ్డి | 75 | 43 | 6 | 3 | 0 | 23 |
| 22 | సంగారెడ్డి | 139 | 58 | 2 | 0 | 0 | 19 |
| 23 | సిద్దిపేట | 130 | 5 | 2 | 0 | 1 | 21 |
| 24 | సూర్యపేట | 73 | 43 | 4 | 1 | 2 | 5 |
| 25 | వికారాబాద్ | 91 | 40 | 0 | 0 | 1 | 13 |
| 26 | వనపర్తి | 24 | 7 | 1 | 0 | 0 | 33 |
| 27 | వరంగల్ రూరల్ | 131 | 31 | 0 | 0 | 0 | 8 |
| 28 | యాదాద్రి | 60 | 19 | 1 | 0 | 1 | 19 |
| 29 | వరంగల్ అర్భన్ | 13 | 0 | 0 | 0 | 0 | 0 |
| 30 | మహబూబాబాద్ | 67 | 28 | 0 | 0 | 0 | 11 |
| మొత్తం | 2,545 | 871 | 34 | 10 | 27 | 725 |


