గుజరాత్‌ ఉపఎన్నికలపై మీ వైఖరేంటి?

Supreme Court issues notice on separate Gujarat Rajya Sabha bypolls - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకోసం వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్‌ కాంగ్రెస్‌ వేసిన పిల్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో జూన్‌ 24లోగా స్పందన తెలపాలని బుధవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జూన్‌ 25న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం తెలియజేసింది. గుజరాత్‌ కాంగ్రెస్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది వివేక్‌ తంఖా మాట్లాడుతూ, ఈ విషయంలో గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వాదించారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ, ఎన్నికల షెడ్యూల్‌ ఒకటే ఉన్నప్పటికీ ప్రత్యేక స్థితిలో ఏర్పడిన ఖాళీలను వేర్వేరుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top