
పూరి: దేశంలో ఎన్నికల వేడీ రోజురోజుకు పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు దఫాల పోలింగ్ ముగిసింది. ఆదివారానికి మూడోదఫా పోలింగ్‌కు సంబంధించిన ప్రచారం ముగిసింది. దీంతో మూడో దఫా పోలింగ్‌లో పోటీ పడుతున్న అభ్యర్థులు ఆదివారం సాయంత్రం వరకు జోరుగా ప్రచారం నిర్వహించి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒడిశా పూరి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర ఆదివారం సాయంత్రం పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రచారపర్వంలో బిజి బిజీగా గడిపిన పాత్ర.. ఆ పర్వ ముగిసేదశలో ఆలయంలో సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన సాష్టాంగ ప్రణామం చేసిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.