నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు | Nityanand Rai Controversial Comments | Sakshi
Sakshi News home page

నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు

Nov 21 2017 3:06 PM | Updated on Nov 21 2017 3:10 PM

Nityanand Rai Controversial Comments - Sakshi - Sakshi

పట్నా: బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు, ఉజియర్‌పూర్‌ ఎంపీ నిత్యానంద రాయ్‌ ప్రధాని నరేంద్ర మోదీపై స్వామిభక్తి చాటుకుని వివాదంలో చిక్కుకున్నారు. మోదీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని వ్యాఖ్యానించి దుమారం రేపారు.

సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ సొంత కుమారుడు పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారు. మనుషుల మధ్య అభిప్రాయబేధాలు సహజం. దేశంలో వాటికి విలువ ఇవ్వాల్సిందే. ఆయనకు(మోదీ)కి వ్యతిరేకంగా ఎవరైనా చేయి లేదా వేలెత్తి చూపితే వాటిని విరగొట్టేందుకు మేమంతా ఒక్కటవుతాం. నరడానికి కూడా వెనుకాడబోమ’ని వ్యాఖ్యానించారు.

నిత్యానంద వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఖండించారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యానంద వ్యాఖ్యలను జేడీ(యూ) నాయకుడు అజయ్‌ అలోక్‌ సమర్థించారు. ఆయన మాటల్లోని భావోద్వేగాలు చూడాలని, ఆయన వాడిన మాటలు కాదని అన్నారు. నరేంద్ర మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని నిత్యానంద పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement