breaking news
ujiarpur
-
నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు
పట్నా: బిహార్ బీజేపీ అధ్యక్షుడు, ఉజియర్పూర్ ఎంపీ నిత్యానంద రాయ్ ప్రధాని నరేంద్ర మోదీపై స్వామిభక్తి చాటుకుని వివాదంలో చిక్కుకున్నారు. మోదీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని వ్యాఖ్యానించి దుమారం రేపారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ సొంత కుమారుడు పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారు. మనుషుల మధ్య అభిప్రాయబేధాలు సహజం. దేశంలో వాటికి విలువ ఇవ్వాల్సిందే. ఆయనకు(మోదీ)కి వ్యతిరేకంగా ఎవరైనా చేయి లేదా వేలెత్తి చూపితే వాటిని విరగొట్టేందుకు మేమంతా ఒక్కటవుతాం. నరడానికి కూడా వెనుకాడబోమ’ని వ్యాఖ్యానించారు. నిత్యానంద వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యానంద వ్యాఖ్యలను జేడీ(యూ) నాయకుడు అజయ్ అలోక్ సమర్థించారు. ఆయన మాటల్లోని భావోద్వేగాలు చూడాలని, ఆయన వాడిన మాటలు కాదని అన్నారు. నరేంద్ర మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని నిత్యానంద పేర్కొనడం గమనార్హం. -
తన పార్టీకి ఓటేయని భార్యను కాల్చేసిన భర్త
తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని ఓ ప్రబుద్ధుడు భార్యను కాల్చిపారేశాడు. ఈ సంఘటనలో భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులంటున్నారు. ఈ సంఘటన బీహార్ లోని ఉజియార్ పూర్ నియోజకవర్గం లోని మొయినుద్దీన్ నగర్ లో జరిగింది. ఉజియార్ పూర్ లో బుధవారం ఎన్నికలు జరిగాయి. వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి భార్య తన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేయడంతో మండిపడ్డాడు. పట్టలేని కోపంతో తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు పాశ్వాన్ పారిపోయాడు.