టీడీపీలో చేరిన మాజీ సీఎం సోదరుడు | nallari kishore kumar reddy joins TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరిన మాజీ సీఎం సోదరుడు

Nov 23 2017 8:36 PM | Updated on Nov 23 2017 8:41 PM

nallari kishore kumar reddy joins TDP - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి: నల్లారి కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, తన కుమారుడు అమర్ నాథ్ రెడ్డితో కలిసి గురువారం టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారని అన్నారు. నల్లారి అమర్ నాధ్ రెడ్డితో తాను కలిసి పని చేశానని ఆయన వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నల్లారి కుటుంబానికి ఉందని గుర్తు చేశారు. నల్లారి కుటుంబం సేవలు పీలేరు నియోజకవర్గానికి ఎంతో అవసరమన్నారు. హేతుబద్దత లేని రాష్ట్ర విభజన జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో పోరాడారని ప్రశంసించారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. కిషోర్ కుమార్ రెడ్డి అనునిత్యం ప్రజలతోనే ఉంటారని, పీలేరు ఇంచార్జిగా ఆయనను నియమిస్తున్నట్టు ప్రకటించారు. కుప్పంతో పోటీపడి పీలేరులో కూడా మంచి మెజారిటీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement