ఎలుకతో అసెంబ్లీకి ఆర్జేడీ ఎమ్మెల్యేలు

MLAs of the RJD Brought Mouse To Assembly in Bihar - Sakshi

పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష ఆర్జేడీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో.. శుక్రవారం విపక్ష శాసనసభ్యులు ఎలుకను వెంటపెట్టుకుని సభకు వచ్చారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం కీలక పత్రాలను మాయం చేస్తోందని, వాటిపై ప్రశ్నిస్తే ఎలుకలను సాకుగా చూపుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడిసిన్‌, లిక్కర్‌ మాఫియా జరుగుతోందని వాటికి కూడా ఎలుకలనే సాకుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎలుకలను పట్టుకుని వచ్చి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top