
సాక్షి, విశాఖపట్నం : అవినీతి రహిత సమాజమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నియోజకవర్గ గ్రామ స్థాయి వాలంటీర్, వార్డ్ వాలంటీర్‌ల పరిచయ వేదికను అవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులు చేయోద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించిందనడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని మంత్రి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలోనే లక్షల ఉద్యోగాలు చూపెట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదని తెలిపారు.