సీఎం..కేరాఫ్‌ రామనగర

Kumaraswamy Fourth CM From Ramanagara Karnataka Assembly Elections - Sakshi

ఈ జిల్లా నుంచి నలుగురు సీఎంలు

కెంగల్, దేవేగౌడ, రామకృష్ణ హెగ్డే,కుమారలు

కుమారస్వామికి రెండోసారి అదృష్టం

ఒక జిల్లా నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు ముఖ్యమంత్రులు కావడం యాదృచ్ఛికం కావచ్చు, అయినా అది విశేషమే కదా. బెంగళూరు సమీపంలోని రామనగర జిల్లా ఈ ఖ్యాతిని సంపాదించుకుంది. తాజాగా సీఎం కాబోయే జేడీఎల్పీ నేత కుమారస్వామి ఈసారి రామనగర నుంచి గెలవడం తెలిసిందే.

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: రాష్ట్రానికి రామనగర జిల్లా మరోసారి ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని దక్కించుకుంది. తాజాగా జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో కలిపి రామననగర జిల్లా నుండి ఎన్నికయిన ఎమ్మెల్యేలు మొత్తం నలుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. జిల్లాలో మాగడి నియోజకవర్గం మినహా కనకపుర, రామనగర, చెన్నపట్టణ నియోజకవర్గాల నుండి ఎన్నికయిన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు.

కెంగల్‌ హనుమంతయ్య నాంది
మైసూరు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం 2వ ము ఖ్యమంత్రిగా ఎన్నికయిన ప్రముఖ వ్యక్తి కెంగల్‌ హ నుమంతయ్య.ఆయన అప్పట్లో రామనగర నుండి ఎన్నికయ్యారు. 1952 నుండి 1956 వరకూ ఆయన రాష్ట్ర ము ఖ్యమమంత్రిగా పనిచేశారు. ఈయన తరువాత సుమా రు మూడున్నర, నాలుగు దశాబ్దాల పా టు రామనగర నుంచి ఎవరూ సీఎం కుర్చీని అందుకోలేదు.

దేవేగౌడ వంతు
వరుసగా ఓటమి పాలవుతూ రాజకీయ భవిష్యత్తు కో సం ఎదురు చూస్తున్న హెచ్‌డీ దేవేగౌడ 1994లో జరిగి న అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్‌ అభ్యర్థిగా రామనగర నుండి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడే ఆయ న ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం 172 రోజుల పా టు రాష్ట్రాన్ని పాలించారు. తరువాత నాటకీయ పరిణా మాలతో ఆయన దేశ ప్రధానిగా అందలమెక్కారు.

రామకృష్ణ హెగ్డే ఇలా
 1983లో ముఖ్యమంత్రి అయిన రామకృష్ణ హెగ్డే చట్టసభ సభ్యుడు కాకపోవడంతో ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి వచ్చింది. అప్పట్లో కనకపుర ఎమ్మెల్యే పీజీ ఆర్‌ సింధ్యా చేత రాజీనామా ఇప్పించి రామకృష్ణ హెగ్డే పోటీ చేసి గెలిచారు.

కుమారస్వామి అదృష్టం
తరువాత 2004లో దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికల్లో మొదటిసారిగా రామనగర నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకున్న కారణంగా అదృష్టం తన్నుకొచ్చి కుమారస్వామి ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. ఒక సంవత్సరం 253 రోజుల పాటు పదవిలో ఉన్నారు.

ఈసారి ఏమవుతుందో..?
ఈ దఫా రామనగరతో పాటు మొదటిసారిగా చెన్నపట్టణ నుండి పోటీ చేసి కుమారస్వామి గెలుపొందా రు. ఆయన రామనగర స్థానానికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిజానికి చెన్నపట్టణలో ప్రజలు కుమారస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటిం చడం వల్లే గెలిపించారని చెప్పవచ్చు. ఏది ఏమైనా రామనగర అనేది కేరాఫ్‌ ముఖ్యమంత్రిగా మారింద ని జిల్లా ప్రజలు ఆనందంగా చెప్పుకుంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top