నర్సాపురంలో టీడీపీకి కొత్తపల్లి షాక్‌

Kothapalli Subbarayudu quits TDP, join his ysr congress party - Sakshi

టీడీపీకి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతాం

రెండు జిల్లాల్లో మ సత్తా చూపిస్తాం

వైఎస్‌ జగన్‌ సీఎం అవడం ఖాయం

సాక్షి, నర్సాపురం : పశ‍్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామం. మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం ఆయన రాజీనామా పత్రాలపై తన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నన్ను, నా ప్రజలను నమ్మించి మోసం చేశాడు. కనీసం నన్ను సంప్రదించకుండా నర్సాపురం సీటు కేటాయించడం చాలా బాధాకరం. నాకు టికెట్‌ ఇవ్వకపోయినా బాధలేదు. కానీ నమ్మకద్రోహం చేయడం నా ప్రజలు ఆవేదన చెందారు. నాతో పాటు పదిమంది కౌన్సిలర్లు, వేలాదిమంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేస్తున్నాం. చదవండి...(వైఎస్‌ జగన్‌ను కలిసిన కొత్తపల్లి సుబ్బారాయుడు)

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. నా ప్రతాపం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో చూపిస్తాను. రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తా.’ అని స్పష్టం చేశారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్న (ఆదివారం) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top