సముచిత స్థానం కల్పిస్తే ద్రోహం చేస్తావా?

Koppula Eshwar Fires On Vivek - Sakshi

వివేక్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధ్వజం   

గోదావరిఖని/మంచిర్యాల: మాజీ ఎంపీ వివేక్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ ద్రోహం చేయలేదని, ఆయన పార్టీకి తీరని ద్రోహం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో, మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఓటమికి వివేక్‌ కుట్ర చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులతో టచ్‌లోనే ఉంటూ, వారికి ఆర్థికంగా సాయం చేయడం వల్లనే ధర్మపురిలో తన గెలుపు కష్టసాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే సీఎంతో మాట్లాడి, పార్టీ ద్రోహులకు టికెట్టు ఇవ్వొద్దని కోరినట్లు చెప్పా రు. 2013లో టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వివేక్‌.. 2014లో కాంగ్రెస్‌లోకి జంపు చేశారని, ఎంపీగా ఓడిపోయిన ఆయన్ను , సీఎం కేసీఆర్‌ పార్టీలోకి చేర్చుకుని గౌరవప్రదమైన ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చి సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. 

దళితుడివి కాదు ధనికుడివి: సుమన్‌  
‘వివేక్‌..నీవు దళితుడివి కాదు ధనికుడివి.. నీవు దళితులకు ఏమి చేశావు? డబ్బు ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించావ్‌. నిజమైన దళితులం మేమే’అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. వివేక్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ ఏం ద్రోహం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top