కేసీఆర్‌ ఆస్తులు.. అప్పులు

KCR Assets And Debits Shown In Nomination Papers - Sakshi

ఆస్తులు రూ.22.6 కోట్లు.. అప్పులు రూ.8.88 కోట్లు

అఫిడవిట్‌లో వెల్లడించిన కేసీఆర్‌

సాక్షి, గజ్వేల్‌(సిద్దిపేట జిల్లా): ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం గజ్వేల్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో సమర్పించారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు. 
 

కేసీఆర్‌ మొత్తం ఆస్తుల విలువ- రూ.22,60,77,936  

  • చరాస్తులు- రూ.10,40,77,946 
  • స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్‌ వగైరా..)  
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు- రూ.5,63,73,946  
  • తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000  
  • తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000  
  • కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000)  

మొత్తం అప్పులు- రూ.8,88,47,570 

  • ఇందులో కుమారుడు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570
  • కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000 
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఏడాదికి కడుతున్న బీమా- రూ.99 వేలు 
  • తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 64 కేసులు ఉన్నట్లు కేసీఆర్‌ తన అఫిడవిట్‌లో చూపించారు. 
  • కేసీఆర్‌ సతీమణి శోభ పేరుమీద రూ.94,59,779 విలువైన ఆస్తులున్నాయి. ఇందులో బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఇతర ఆభరణాల విలువే అధికం. ఆమె వద్ద 2.2 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 93,66,184. 
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top