కర్ణాటక అప్‌డేట్స్: గవర్నర్‌తో కుమారస్వామి భేటీ

Karnataka Assembly Floor Test Live Updates - Sakshi

సాక్షి, బెంగళూరు : తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి బీఎస్‌ యడ్యూరప్ప రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. తమకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ జరగకముందే ఆయన తప్పుకున్నట్టయింది. 55 గంటలపాటు సీఎంగా ఉన్న యెడ్డీ.. నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

లైవ్ అప్‌డేట్స్:

  • రాజ్‌భవన్‌కు చేరుకున్న కుమారస్వామి. గవర్నర్‌తో భేటీ అయిన కుమారస్వామి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు
     
  • సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలువనున్న కుమారస్వామి..
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్న కుమారస్వామి..
  • కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం.. మంత్రిమండలి కూర్పును సిద్ధం చేస్తున్న ఇరుపార్టీల నేతలు
  • యడ్యూరప్ప రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న కుమారస్వామి..
  • గవర్నర్‌ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం.. పిలుపు అందగానే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుస్తాం: జేడీఎస్‌ ఎల్పీ నేత కుమారస్వామి
  • గవర్నర్‌ వజుభాయ్‌ వాలాకు రాజీనామా లేఖ సమర్పించిన యడ్యూరప్ప
  • యడ్యూరప్పతో పాటు ఇతర బీజేపీ నేతలు కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న గులాం నబీ ఆజాద్‌. కొందరు ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసే యత్నం కూడా జరిగిందని ఆరోపణలు.
  • రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప. గవర్నర్‌ వజుభాయ్‌ వాలాతో భేటీ కానున్న యెడ్డీ.
  • ప్రజాస్వామ్యం గెలిచిందంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు
  • యడ్యూరప్ప రాజీనామా ప్రకటన అనంతరం వాయిదా పడిన కర్ణాటక అసెంబ్లీ
  • భావోద్వేగంతో ప్రసంగిస్తూ సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడ్యూరప్ప. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తాని చెప్పిన యడ్యూరప్ప. విశ్వాసపరీక్షకు ముందే వెనక్కి తగ్గిన యెడ్డీ 
  • ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకం ఉందన్నారు యడ్యూరప్ప. ప్రజలు మాకు అత్యధిక సీట్లు అప్పగించారు. కానీ కర్ణాటక ప్రజలకు సేవచేసే భాగ్యం కలగక పోవడం మా దురదృష్ణం. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
  • అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సీఎం యడ్యూరప్ప
  • ఆనంద్‌సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ బోపన్న. అనంతరం ఆనంద్ సింగ్ పక్కనే కూర్చున్న డీకే శివకుమార్‌
  • అసెంబ్లీ గ్యాలరీలో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు. కాంగ్రెస్‌ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, గెహ్లాట్. బీజేపీ నుంచి సదానందగౌడ, అనంతకుమార్‌.
  • వాయిదా అనంతరం 3:30 గంటలకు మళ్లీ ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ. నేతలతో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రొటెం స్పీకర్ బోపన్న
  • అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్‌, ప్రతాప్‌ గౌడ పాటిల్‌లతో కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు. ఆనంద్, ప్రతాప్‌లు కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేయరని అభిప్రాయపడ్డ శివకుమార్ 
  • గవర్నర్‌ వజుభాయ్‌ వాలను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన యడ్యూరప్ప. గవర్నర్‌తో సమావేశమైన యెడ్డీ. అయితే గవర్నర్‌ను కలిసే ముందు అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడిన యెడ్డీ. విశ్వాస పరీక్షకు ముందు కర్ణాటకలో బీజేపీలో జోరుగా మంతనాలు
  • కాంగ్రెస్ మిస్సింగ్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ గోల్డ్‌ఫించ్ హాటల్‌ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు.

                                                                   ఆనంద్‌సింగ్
  • ఉదయం ప్రమాణ స్వీకారం సమయంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు డీకే సురేష్, దినేష్ గుండు రావుతో కలిసి భోజనం చేసిన ప్రతాప్‌ గౌడ 

                                                               ప్రతాప్ గౌడ పాటిల్
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top