‘14.6 కోట్ల మంది రైతులకు లబ్ది’

Kanna Lakshmi Narayana Says Farmers Get Beneficiary By PM Kisan Scheme - Sakshi

సాక్షి, గుంటూరు : దేశాభివృద్ధికై గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పడిన కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీ మొదటి క్యాబినెట్‌ మీటింగ్‌లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సిద్ధి(పీఎంకేఎస్‌ఎస్‌) పథకం ద్వారా రూ. 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి లబ్ది చేకూరుతుందని తెలిపారు.

ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో క్యాడర్‌ను బలోపేతం చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సర్పంచ్‌ నుంచి జడ్పీటీసీల వరకు కొత్త వారిని చేర్చుకుని..ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అయితే కోర్‌ కమిటీతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎంగా పనిచేసిన చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదని విమర్శించారు. ఇతరులతో గొడవలు పెట్టుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top