కేసీఆర్‌ సభతో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ

Jagadish Reddy Slams On Congress Leaders Nalgonda - Sakshi

నల్లగొండ రూరల్‌ : కేసీఆర్‌ సభతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందని ఆపద్ధర్మ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు . మంగళవారం మర్రిగూడ బైపాస్‌లోని సీఎం సభాస్థలి ఏర్పాట్లను మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీప నియోజక వర్గాలనుంచి 50 వేల మందిని తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సభకు ఉమ్మడి జిల్లా నుంచి 4 లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం సభతో జిల్లాలో 12 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు.  సీఎం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలో కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు.  విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ సభలో సీఎం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేయబోయే అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తారన్నారు. కాంగ్రెస్‌లో రౌడీ , గుండా నాయకులు ఉన్నారని ప్రజలను గౌరవిం చి మాట్లాడే విధానం వారికి తెలియదని ఆయన విమర్శించారు.

హెలీపాడ్‌ ట్రయల్‌ రన్‌..
నల్లగొండలో జరిగే సీఎం సభకు హెలిపాడ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ నెల 4న సీఎం నల్లగొండలో నిర్వహిస్తున్న ఆశీర్వాద సభకు వస్తుండడంతో హెలిప్యాడ్‌ను ట్రయల్‌ రన్‌ను ప్రత్యేక అధికారులు పరిశీలించారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
కనగల్‌ : మండలంలోని లింగాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లా కేం ద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  పార్టీ లో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారన్నారు.  రాష్ట్రంలో టీ æఆర్‌ఎస్‌ వందకుపైగా ఎమ్మెల్యే స్థానాలను గెల ు స్తుందన్నారు.ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓర్సు మారయ్య, సైదులు, నాగయ్య, మైసయ్య, వెం కన్న, పరశురాం, రాజు, లింగయ్య, వెంటయ్య తదితరులు ఉన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి,  నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top