
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చే సమయంలో.. అసెంబ్లీ లోపలకి వెళుతున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వగా, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సంపత్ ఏకంగా రేవంత్‌ను ఆలింగనం చేసుకున్నారు. కాగా రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు.