హార్దిక్‌ పటేల్‌కు హైకోర్టు షాక్‌

Hardik Patel Can not Contest Polls as Gujarat HC Refuses to Stay Conviction - Sakshi

సెషన్స్‌ కోర్టు తీర్పుపై స్టేకు నో

దీంతో ఎన్నికల్లో పోటీకి అనర్హత

అహ్మదాబాద్‌: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌కు గుజరాత్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్‌ పటేల్‌పై 17 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని గుజరాత్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్‌ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్‌ పటేల్‌ కార్యాలయంపై దాడిచేశారు.

ఈ కేసును విచారించిన విస్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్‌ గతేడాది గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హార్దిక్‌ జామ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్‌నగర్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. గుజరాత్‌లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top