
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పార్టీ గుర్తు లభించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.సాంబశివగౌడ్, ఉపాధ్యక్షుడు రఘునాథతో కలసి శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి వస్తే ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పిన టీఆర్‌ఎస్ పార్టీ హామీ నిలబెట్టుకోలేదని, పాలనను అవినీతిమయం చేసిందని విమర్శించారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పార్టీ ఆవిర్భవించిందని, బడుగు, బలహీన వర్గాల న్యాయం కోసం పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.