కలకలం : సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌ | Congress Sarpanch Candidate Kidnap In Kodangal | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ చివరి రోజు సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌

Jan 9 2019 4:35 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Sarpanch Candidate Kidnap In Kodangal - Sakshi

సాక్షి, కొడంగల్‌ : గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌ అయిన ఘటన వికారబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. కొడంగల్‌ నియోజకవర్గంలోని నిటూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి విశ్వనాథ్‌ ని బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విశ్వనాథ్ నేడు నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో ఆయన నామినేషన్‌ను అడ్డుకునేందుకే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. నేడు నామినేషన్‌ వెయాల్సిన విశ్వనాథ్‌ 9గంటలుగా కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆ గ్రామంలో పలు హత్యలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

ఎస్పీకి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు
తన నియోజవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హుటాహుటిన నిటూరు గ్రామానికి చేరుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకుని, కిడ్నాప్ వ్యవహారంపై  వికారబాద్‌ ఎస్పీకి  ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement