‘ముచ్చటేలేదు.. 150 కొట్టేస్తాం.. ’ | Confident of Winning 150 Seats in Karnataka : yeddyurappa | Sakshi
Sakshi News home page

‘ముచ్చటేలేదు.. 150 కొట్టేస్తాం.. ’

Jan 21 2018 10:55 AM | Updated on Jan 21 2018 11:02 AM

Confident of Winning 150 Seats in Karnataka : yeddyurappa - Sakshi

సాక్షి, బెంగళూరు : ‘సిద్ద రామయ్య ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. కాంగ్రెస్‌ పార్టీని ఇక మా రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మార్పు మొదలైంది. మరో మాటకు అవకాశం లేదు. కచ్చితంగా 150 సీట్లు గెలిచి తీరుతాం’  అని బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 75 రోజులుగా పరివర్తన యాత్ర చేస్తున్న ఆయన తన సొంత జిల్లా మాండియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పచ్చి అవకాశ వాది అని, హిందుత్వం పేరిట లాభం పొందాలనుకుంటున్నారని అన్నారు. హిందువుల గురించి తెగ మాట్లాడుతున్న రాహుల్‌ ఎన్నికలు ముగిశాక ఆ విషయం మరిచిపోతారని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్‌ విభజన రాజకీయాలు చేస్తోందని, లింగాయత్‌లు వీరశైవులు తన దృష్టిలో ఒకటేనని చెప్పారు. గుజరాత్‌ 150 సీట్ల మార్క్‌ బీజేపీ అందుకోలేకపోయిందిగా అని ప్రశ్నించగా కర్ణాటకలో మాత్రం తమ పార్టీ కచ్చితంగా 150 సీట్ల మార్క్‌ను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement