కేంద్రం నమ్మించి మోసం చేసింది | Chandrababu naidu commented on bjp | Sakshi
Sakshi News home page

కేంద్రం నమ్మించి మోసం చేసింది

Apr 6 2018 2:58 AM | Updated on Jul 28 2018 6:35 PM

Chandrababu naidu commented on bjp - Sakshi

సాక్షి, అమరావతి: ‘కేంద్రం నమ్మించి మోసం చేసింది. నేను నమ్మాను. మీ కోసం నమ్మాను. నాకు బీజేపీతో అవసరంలేదు. ప్రధానమంత్రితో అవసరంలేదు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మి బీజేపీతో కలిశాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రభుత్వం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. అందరికంటే సీనియర్‌ నాయకుడిని తానేనని, తన తరువాతే అందరూ వచ్చి సీఎంలు, పీఎంలు అయ్యారని చెప్పారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అడిగానని.. రోజుకో మాట చెప్పి మొండిచేయి చూపించే పరిస్థితికి వచ్చారని.. అవమానించాలని చూస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. అంతకుముందు.. నగరంలోని రామవరప్పాడు సెంటర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement