కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ తొలిస్థానం: బుగ్గన

Buggana Rajendranath Reddy Slams Chandrababu And Yellow Media - Sakshi

ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బుగ్గన

సాక్షి, అమరావతి: కరోనాతో సహజీవనం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని.. కరోనా గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షరసత్యమని పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 2వేల 460 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 1919 వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించడం ద్వారా మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఇవేమీ కనిపించడం లేదని.. తన ఎల్లో మీడియా సహాయంతో ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.(అందరూ అదే మాట.. నిజం చెప్పిన నేత)

ఇక కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సహాయం చేయలేదన్న బుగ్గన.. ప్రభుత్వం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 403 మంది డిశ్చార్జ్‌ అయ్యారని.. వైద్యులు అత్యుత్తమ సేవలు అందించడం వల్లే వైరస్‌ బారి నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని కొనియాడారు. పరీక్షల నిర్వహణ ఆధారంగా.. కరోనా పాజిటివ్‌ కేసుల శాతాన్ని చూడకుండా.. ఏపీలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లుగా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.(ఆంధ్రప్రదేశ్‌లో మే నెల పెన్షన్ల పంపిణీ)

కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top