టీడీపీపై ఫైర్‌ అయిన జీవీఎల్‌ | BJP MP GVL Narasimha Rao Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

Aug 24 2018 1:43 PM | Updated on Aug 24 2018 2:35 PM

BJP MP GVL Narasimha Rao Fires on Chandrababu - Sakshi

సాక్షి, ప్రకాశం : రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రూ.3 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే.. టీడీపీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ధ‍్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి బాండ్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనక్కి పోవడానికి ఏపీ ప‍్రభుత్వ అనుసరిస్తున్న వైఖరే కారణమన్నారు. ఈ విషయంలో కేంద్రం సుముఖంగానే ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోర్టు వెనక్కు వెళ్తోందని దుయ్యబట్టారు. ఇండస్ట్రీయల్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సహాయం చేయడం లేదంటూ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement