‘నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలి’ | BJP leaders says to TDP give stipend to Unemployed youths | Sakshi
Sakshi News home page

‘నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలి’

Nov 3 2017 8:39 PM | Updated on Mar 28 2019 8:37 PM

BJP leaders says to TDP give stipend to Unemployed youths - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో గెలవడం కోసం సీఎం చంద్రబాబా నాయుడు అప్పట్లో చాలా హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో నిరుద్యోగ భృతి కూడా ఒక్కటి. ఆ నిరుద్యోగ భృతి హామీని టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు చిన్నపురెడ్డి, రవీంద్ర రెడ్డి, రమేష్‌ నాయుడులు సూచించారు. వారు బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుంగా ప్రతి ఒక్కరికి 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. 

రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని అన్నారు. ఉపాధి అవకాశాలు లేక చాలామంది నిరుద్యోగులు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు తెలిపారు. డిసెంబర్‌ మొదటి వారంలో నిరుద్యోగ భృతి ప్రకటించాలని కోరారు. ఆలస్యం చేస్తే నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్ష 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏపీపీఎస్‌సీ పూర్తిగా విఫలమైందని బీజేపీ నేతలు విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement