‘ఆయన భయపడి డైపర్స్‌ వేసుకుని తిరుగుతున్నాడు’ | BJP Leader Nallu Indrasena Reddy Slams KTR In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఆయన భయపడి డైపర్స్‌ వేసుకుని తిరుగుతున్నాడు’

Nov 28 2018 8:48 PM | Updated on Nov 28 2018 8:49 PM

BJP Leader Nallu Indrasena Reddy Slams KTR In Hyderabad - Sakshi

బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి

 మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు..

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలకు భయపడి కేటీఆర్‌ డైపర్స్‌ వేసుకుని తిరుగుతున్నారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఇంద్రసేనా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. డిసెంబర్‌ ఏడవ తేదీ తర్వాత డైపర్స్‌ కూడా దొరకవని వ్యంగ్యంగా మాట్లాడారు. బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతా అని సూటిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు.

కేటీఆర్‌ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్‌, కేటీఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.  మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాక్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement