
సాక్షి, బెంగళూరు : గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పరిపూర్ణం కావడంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా.. కర్ణాటక ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని కర్నాటకలో పార్టీ అబ్జర్వర్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్ ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల గురించి స్థానిక నేతలతో చర్చించేందుకు ఆయన గురువారం బెంగళూరు వచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు, స్థానిక సమస్యలను పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతారని ఆప్ రాష్ట్ర కన్వీనర్ పృథ్వీ రెడ్డి చెప్పారు. పార్టీకి ఇక్కడ నాయకత్వ సమస్య ఉన్నా... కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.