ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

Crossfire between police and naxals - Sakshi

మావోయిస్టు మృతి

భారీగా సామగ్రి స్వాధీనం

మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పాలంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పేద్‌మెల్, పలమడుగు అడవిలో గురువారం ఉదయం 8గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ జవాన్లు ఉదయం కూంబింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో మావోయిస్టుల శిబిరం తారసపడడంతో ఇరువర్గాల మధ్య రెండుగంటల పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు.

అనంతరం జవాన్లు మావోయిస్టుల శిబిరం వద్దకు వెళ్లి పరిశీలించగా ఒక మృతదేహంతో పాటు  రెండు పెద్ద గన్‌లు, చిన్న తుపాకీ, డిటోనేటర్స్, మందులు, మావోయిస్టుల సాహిత్యం, విద్యుత్‌ వైర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుకుమా ఎస్పీ అభిషేక్‌ మిన్నా మాట్లాడుతూ మావోయిస్టుల ఆవిర్భావ వార్షికోత్సవం  సందర్భంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో నిర్వహించే కార్యక్రమానికి  హాజరయ్యేందుకు మావోయిస్టులు వస్తుండగా జవాన్లకు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయని తెలిపారు. జవాన్లు కూంబింగ్‌ నుంచి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. 

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top