మానవహక్కుల వేదిక ఆరవ మహాసభలు | human rights 6th mahasabhalu | Sakshi
Sakshi News home page

మానవహక్కుల వేదిక ఆరవ మహాసభలు

Oct 10 2015 1:10 AM | Updated on Sep 3 2017 10:41 AM

మానవ హక్కుల వేదిక 6వ మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కె.జి.ఎన్ ఫంక్షన్ హాలులో జరుగనున్నాయి.

మానవ హక్కుల వేదిక 6వ మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని  కె.జి.ఎన్  ఫంక్షన్ హాలులో జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే  ఆ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హెచ్‌ఆర్‌ఎఫ్ కార్యకర్తలు హాజరు కానున్నారు. తొలిరోజు కాన్ఫరెన్సులో సమకాలీన ప్రాధాన్య అంశాలపై బహిరంగ సెషన్‌లో చర్చలు జరుగుతాయి. ఉదయం ప్రారంభ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన రచయిత, హక్కుల కార్యకర్త సుభాష్ ఘటాడే ‘నయా ఉదారవాదం - హిం దూత్వ నమూనా’ అనే అంశంపై ప్రసంగిస్తారు.

అనంతరం ఆంధ్రా విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.డి.సత్యపాల్ ‘అంబేడ్క రిజాన్ని బ్రాహ్మణీకరించే కుట్ర’ అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సెషన్‌లో ఢిల్లీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ ఉషా రామనాథన్ ‘ప్రభు త్వం- కొత్త భూస్వాహా పద్ధతులు’ అనే అంశంపైనా, హెచ్‌ఆర్‌ఎఫ్ ఉపాధ్యక్షులు ఎ. చంద్రశేఖర్ ‘అసమాన అభివృద్ధి-రాయలసీమ దుస్థితి’ అనే అంశంపై ప్రసం గించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు అనంతరం ఆదోని మునిసి పల్ హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరుగుతుంది. అక్టోబర్ 11న సంస్థాగత కార్యక్రమం ఉంటుంది. సదస్సు ప్రతినిధులు సంస్థ కార్యక్రమాలను సమీక్షించి, చర్చించి రానున్న రెండేళ్ల పనికి సంబంధించి విధివిధానాలు నిర్ణయించుకుం టారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు.

 రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రశ్నించే గొంతుల అవసరం మరింతగా ఉందని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. అనేక వాగ్దానాలతో, ప్రజల్లో పలు ఆశలు రేకెత్తించి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ప్రతి పక్షంలో ఉండగా తాము తీవ్రంగా విమర్శించిన విధానాలనే చంద్రబాబు, కేసీఆర్‌లు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు నైవేద్యంగా సమర్పించి కమీషన్లు దండుకోవడా నికి ఇద్దరు సీఎంలూ పోటీపడుతున్నారు. ఉమ్మడి వనరులను ప్రజల మేలు కోసం వినియోగించాలనే రాజ్యాంగ ఆదేశిక సూత్రాన్ని అపహాస్యం చేస్తున్నారు. అభివృద్ధి అనేది లాభదాయకమైన పరిశ్రమగా మారిన నేపథ్యంలో అభివృద్ధి ఫలాల్లో సింహభాగం కార్పొరేట్ సంస్థలకు పోగా మిగిలిన భాగాన్ని పాలక పార్టీల నేతలూ, అనుచరగణం తమతమ స్థాయిలను బట్టి పంచుకుంటు న్నారు. మరోవైపున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయడంతో వందలాదిగా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.

గత జూన్ 2 తర్వాత  తెలంగాణలో 1,290 మంది రైతులు ఆత్మహత్యలు జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో అవి 400 దాటాయి.  మనం నిలదీసి అడగకపోతే ఈ పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రేక్షకులు కారాదని కోరుతూ.. మా గొంతుకు మీ గొంతుల్ని కలపమని కోరుతూ ఆదోనిలో 10,11 తేదీల్లో జరిగే మానవ హక్కుల వేదిక ఆరవ సదస్సుకూ,  మహాసభలకు రావలసిం దిగా అందరినీ అహ్వానిస్తున్నాం.
 ఎస్. జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక. మొబైల్: 98489 86286
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement