
గ్రహం అనుగ్రహం, బుధవారం 28, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి బ.పాడ్యమి ప.3.44 వరకు
తదుపరి విదియ
నక్షత్రం భరణి రా.11.23 వరకు
వర్జ్యం ఉ.9.47 నుంచి 11.19 వరకు
దుర్ముహూర్తం ప.11.22 నుంచి 12.12 వరకు
అమృతఘడియలు రా.6.50 నుంచి 8.21 వరకు
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం: 5.28
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: పనులు చకచకా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది.
వృషభం: కుటుంబసభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
మిథునం:ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ లాభాలు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
కర్కాటకం: విద్యార్థుల యత్నాలు సఫలం. విందు వినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది.
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
కన్య: దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా సమస్యలు. ఆరోగ్య భంగం. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
తుల: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు రావచ్చు. ధన వ్యయం. శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం: బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: శుభకార్యాలకు హాజరవుతారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. విందు వినోదాలు. పనుల్లో పురోగతి. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
మీనం: బంధువులతో అకారణంగా విభేదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం.
- సింహంభట్ల సుబ్బారావు