సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

TCSS Bathukamma Celebrations held in Singapore - Sakshi

సింగపూర్‌ :  తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు జోరైన పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో హోరెత్తించారు. ఈ  సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు భారీగా ఎన్నారైలు పాల్గొని బతుకమ్మ ఆడారు.

సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికి, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు సుమారు గత పది సంవత్సరాలుగా విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్‌ఎస్‌ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ఎన్‌ఆర్‌ఈ ఫ్యాషన్స్ వారు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని, సంబరాలు విజయవంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందిస్తున్న  ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్,  ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవుల లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, కల్వ నికిత, నంగునూరి సౌజన్య, గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, తోట గంగాధర్, మారుతి, శ్రీధర్ పోచంపల్లి, సాయిరాం మంత్రిలు వ్యవహరించారు. స్పాన్సర్స్ గురు అకాడమీ, ఆర్కా మీడియా, వేలన్ ట్రేడర్స్, ఎన్‌ఆర్‌ఈ ఫ్యాషన్స్, మలబార్ గోల్డ్ అండ్‌ డైమండ్స్, టింకర్ టోట్స్, ఆర్‌జి‌జి స్టోర్స్, చింతకింది రమేశ్, ముదం అశోక్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజేందర్, సతీష్ శివనాథుల నంగునూరి సౌజన్య రమణ, గర్రేపల్లి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, నందగిరి శిల్పా అజయ్ ఇతర దాతలకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.


 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top