
టెక్సాస్ : టెక్సాస్‌లోని లీవిస్‌విల్లేలోని లిక్కర్‌సిటీ మాల్‌లో లిటిల్ ఎమ్ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. లిక్కర్ షాప్‌లో పని ముగించుకుని సురేష్ షా(46) ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో సురేష్ షా గుండెలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.