కుంభమేళాలో యూపీ కేబినెట్‌ భేటీ  

Yogi Adityanath cabinet meet at Kumbh mela - Sakshi

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా దాదాపు ఆయన మంత్రివర్గం మంగళవారం కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కుంభమేళా వద్దే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్యతో పాటు మంత్రులు, సాధువులు కూడా ఈ పుణ్యతిథి సందర్భంగా స్నానాలు ఆచరించారు. కేబినెట్‌ భేటీలో మంత్రివర్గం పలు నిర్ణయాలను ఆమోదించింది. అలహాబాద్‌ నుంచి (ప్రస్తుత పేరు ప్రయాగ్‌రాజ్‌) పశ్చిమ యూపీని కలిపే 600 కి.మీ. గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఆమోద ముద్ర వేసింది. దీనికోసం రూ.36 వేల కోట్లను కేటాయించనుంది. ప్రపంచంలోనే ఇది పొడవైన రహదారిగా చెబుతున్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకే కాకుండా, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం ఇప్పటికే ప్రతిపాదించిన మేరకు తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top