పరిమితులేమీ లేనే లేవు | 'What NOC?' - Nandana Sen laughs off restrictions on 'Rang Rasiya' | Sakshi
Sakshi News home page

పరిమితులేమీ లేనే లేవు

Aug 9 2014 11:03 PM | Updated on Sep 2 2017 11:38 AM

పరిమితులేమీ లేనే లేవు

పరిమితులేమీ లేనే లేవు

‘రంగ్ రసియా’ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా వాడుకోవద్దని పరిమితులు విధించినట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ నటి నందనాసేన్ కొట్టిపారేసింది.

ముంబై: ‘రంగ్ రసియా’ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా వాడుకోవద్దని పరిమితులు విధించినట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ నటి నందనాసేన్ కొట్టిపారేసింది. ‘అది అవాస్తవం. ఎవరి సృజనాత్మక స్వేచ్ఛను నేను అడ్డుకోలేదు’ అని వందన పేర్కొంది. వివాహం అనంతరం తన జీవితం, కెరీర్ తదితర అంశాల విషయంలో తనను చుట్టుముడుతున్న వదంతులపై ఆర్థిక శాస్త్రంలో నోబుల్ పురస్కార గ్రహీత కుమార్తె అయిన నందన పైవిధంగా వివరణ ఇచ్చింది.

మీకు అత్యంత ఇష్టమైన ‘రంగ్ రసియా’ ఎన్నో ఏళ్ల తర్వాత సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మీరు ఎటువంటి అనుభూతికి లోనవుతున్నారని మీడియా ప్రశ్నించగా చలికాలం తర్వాత వానాకాలం వచ్చినట్టు ఉంది అని నందన ఆనందంగా చెప్పింది. ఈ సినిమాకు సంబంధించి కేతన్ మెహతా మీ వద్ద నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందా అని అడగ్గా అదంతా అభూత కల్పనే అని అంది. కేతన్‌కు ఏది ఇష్టమో అది తనకు కూడా ఇష్టమేనని తెలిపింది.

 సెన్సిటివ్ సీన్లకు సంబంధించినంతవరకూ ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని, కుటుంబసభ్యులతో కూడా చర్చించానని చెప్పింది. అయితే పబ్లిసిటీ మెటీరియల్‌కు సంబంధించి నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులెవరూ తనను సంప్రదించలేదంది. అందువల్ల సృజనాత్మక స్వేచ్ఛను హరించాననే మాట సరైంది కాదంది. వృత్తికి అంకితమవుతానంది. ‘రంగ్ రసియా’ అసాధారణమైన సినిమా అని చెప్పింది. తన జీవితానికి సంబంధించిన సరిహద్దులన్నింటినీ తానే విధించుకున్నానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement