breaking news
ketan mehta
-
మరో వివాదంలో నటి.. లీగల్ నోటీసులు
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. ఇటీవల తను నటించిన సిమ్రాన్ సినిమా టైటిల్స్‌లో అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంగనా అంటూ ఆమె పేరు వేసి క్రెడిట్ ఇవ్వడంపై ఈ సినిమాకు మాటలు అందించిన అపూర్వ అస్రాని తీవ్ర అభ్యంతరం చెప్పగా ఇప్పుడు మరో బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కేతన్ మెహతా ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘రాణి ఆఫ్ జాన్సీ: ది వారియర్ క్వీన్’ చిత్రంలో నటిస్తానని చెప్పిన కంగనా ఇప్పుడు మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటిస్తూ తన డ్రీమ్ ప్రాజెక్టును హైజాక్ చేసిందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ‘మేం కంగనాకు నోటీసులు పంపించాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఇదే సబ్జెక్టుతో ఇటీవల ఆమె మరో చిత్రాన్ని చేస్తుందని మాకు ఇటీవలె తెలిసిందే. అందుకే మేం చట్టబద్ధంగా దీనిని ఎదుర్కోబోతున్నాం’ అని మెహతా చెప్పారు. సర్వం సిద్ధం చేసుకున్నాక తమ ప్రాజెక్టును హైజాక్ చేయడం విశ్వాస ఘాతుకమేనని, ఈ విషయాన్ని అంతతేలికగా వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేశారు. -
పరిమితులేమీ లేనే లేవు
ముంబై: ‘రంగ్ రసియా’ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా వాడుకోవద్దని పరిమితులు విధించినట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ నటి నందనాసేన్ కొట్టిపారేసింది. ‘అది అవాస్తవం. ఎవరి సృజనాత్మక స్వేచ్ఛను నేను అడ్డుకోలేదు’ అని వందన పేర్కొంది. వివాహం అనంతరం తన జీవితం, కెరీర్ తదితర అంశాల విషయంలో తనను చుట్టుముడుతున్న వదంతులపై ఆర్థిక శాస్త్రంలో నోబుల్ పురస్కార గ్రహీత కుమార్తె అయిన నందన పైవిధంగా వివరణ ఇచ్చింది. మీకు అత్యంత ఇష్టమైన ‘రంగ్ రసియా’ ఎన్నో ఏళ్ల తర్వాత సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మీరు ఎటువంటి అనుభూతికి లోనవుతున్నారని మీడియా ప్రశ్నించగా చలికాలం తర్వాత వానాకాలం వచ్చినట్టు ఉంది అని నందన ఆనందంగా చెప్పింది. ఈ సినిమాకు సంబంధించి కేతన్ మెహతా మీ వద్ద నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందా అని అడగ్గా అదంతా అభూత కల్పనే అని అంది. కేతన్కు ఏది ఇష్టమో అది తనకు కూడా ఇష్టమేనని తెలిపింది. సెన్సిటివ్ సీన్లకు సంబంధించినంతవరకూ ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని, కుటుంబసభ్యులతో కూడా చర్చించానని చెప్పింది. అయితే పబ్లిసిటీ మెటీరియల్‌కు సంబంధించి నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులెవరూ తనను సంప్రదించలేదంది. అందువల్ల సృజనాత్మక స్వేచ్ఛను హరించాననే మాట సరైంది కాదంది. వృత్తికి అంకితమవుతానంది. ‘రంగ్ రసియా’ అసాధారణమైన సినిమా అని చెప్పింది. తన జీవితానికి సంబంధించిన సరిహద్దులన్నింటినీ తానే విధించుకున్నానని తెలిపింది.