చిన్న చీమ, పెద్ద డైమండ్‌.. వైరల్‌ వీడియో

Viral Video: Tiny Ant Walking Off With Large Diamond - Sakshi

బలవంతమైన సర్పము.. చలి చీమల చేత చిక్కి ..అనే సుమతీ పద్యం గుర్తుందా. చీమల బలం, నైపుణ్యం గురించి ఇంతకన్నా ఉదాహరణ బహుశా ఉండదేమో. క్రమశిక్షణలోగానీ, ఆహారాన్ని దాచుకునే విషయంలోగానీ చీమ‌ల‌ను చూసి నేర్చుకోవాలంటారు పెద్దలు. ఎందుకంటే శరీర బరువు కంటే దాదాపు 10 రెట్లు బరువున్న వస్తువులను కూడా అవి అలవోకగా మోయ్యగలవట. ఇలా పుట్టల్లోకి లాక్కుపోతూ ఉండే  దృశ్యాలను బాల్యంలో చాలామందిమి  చూసే వుంటాం, కదా.. అయితే  తాజాగా ఇలాంటి చీమ ఒకటి ఆభరణాల షాపులోకి దూరింది.

అక్కడ ఉన్న తెల్లగా మెరిసిపోతున్న డైమండ్స్‌ను చూసి తినుబండారం అనుకుందో ఏమో తెలియదుగానీ...తన చిట్టి బుర్రకు పదును పెట్టింది. డైమండ్‌ వ్యాపారి తన పనిలో మునిగి ఉండగా.. అందులోంచి తనకు నచ్చిన వజ్రాన్ని అతి కష్టం మీద మోసుకు రావడం మొదలు పెట్టింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరా కంటికి చిక్కాయి.. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.   ఇంతకీ ఈ  వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షల రూపాయలట. ఆ వీడియో విశేషాలను మీరు కూడా వీక్షించండి.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top